వరంగల్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాసేపట్లో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు!

by GSrikanth |   ( Updated:2024-03-17 04:37:53.0  )
వరంగల్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాసేపట్లో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొన్న డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులు, బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ మధుసూధన్ రావు మరియు ఏడుగురు డైరెక్టర్స్ మరి కొద్ది సేపట్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపదాస్ మున్షీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇప్పటికే వారంతా హైద‌రాబాద్‌ గాంధీభవన్‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. అయితే పార్టీ మారడానికి కారణం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడని.. అందుకే ఎటువెళ్ళాలో తెలియక కాంగ్రెస్‌లో చేరుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నా కొద్దీ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి.

Advertisement

Next Story