KTR:కేటీఆర్ మరో సంచలన ట్వీట్.. వారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |   ( Updated:2024-11-03 14:26:14.0  )
KTR:కేటీఆర్ మరో సంచలన ట్వీట్.. వారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) పార్టీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister) పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) టార్గెట్‌గా బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(kTR) సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో నేడు (మంగళవారం) ట్విట్టర్(X) వేదికగా స్పందిస్తూ.. ‘‘గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలపై జరిగిన ఈడీ దాడులను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఈడీ దాడులు జరిగి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడుల పై బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నుంచి ఒక్క మాట కూడా లేదన్నారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బులు దొరికినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు కాలేదన్నారు. ఈడీ దాడులు ముగిసిన తర్వాత హైదరాబాద్‌(Hyderabad)లో ఆదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి?’’ అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed