- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP అర్వింద్‌కు మరోసారి నిరసన సెగ.. బీజేపీ కార్యాలయం వద్ద హై టెన్షన్
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా బీజేపీ జిల్లా కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. ఎలాంటి సమాచారం లేకుండా మండల అధ్యక్షులను ఎలా తొలగిస్తారని నేతలు తెలిపారు. సేవ్ బీజేపీ అంటూ ఫకార్డులను ప్రదర్శించారు. ఢిల్లీలో కూడా ఆందోళన చేపడతామని, నడ్డా దృష్టికి సమస్యను తీసుకెళ్తామని బీజేపీ నేతలు తెలిపారు. నాలుగు సెగ్మెంట్లలో సరైన కారణం లేకుండానే తమను తొలగించడం ఏంటని మాజీ మండలాధ్యక్షులు ఎంపీ తీరుపై ఫైర్ అయ్యారు.
ఇటీవల తొలగించిన 13 మండలాలకు చెందిన మండలాధ్యక్షులు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాల్కొండ, బోధన్, ఆర్మూర్‌కు నియోజకవర్గాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర కార్యనిర్వాక సభ్యులు పల్లె గంగారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంలో బీజెవైఎం సమావేశం నడుస్తుండగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం గమనార్హం. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్యను ఫోన్‌లో సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన
బాల్కొండ నియోజక వర్గ ఇన్‌చార్జి రుయ్యడి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే బీజేపీ పార్టీని నమ్ముకున్న వారికి పదవుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అని ఫైర్ అయ్యారు. కేవలం భజన పరులకు మాత్రమే మండల అధ్యక్షులుగా నియమించడం సరికాదన్నారు. గ్రామస్థాయిలో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసి మండల అధ్యక్షులను ఎన్నుకోవాలని, అలా కాకుండా వారికి ఇష్టం వచ్చిన వారికి పదవులు ఇచ్చి పార్టీని అప్రతిష్ట పాలు చేశారన్నారు.
రాష్ట్రస్థాయిలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో జిల్లా స్థాయిలో యువతలో మంచి గుర్తింపు వస్తోందన్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ మునిగిపోయే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్‌తో కొట్లాడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారందరినీ ఇలా పక్కన పెట్టడం పార్టీకి తీరని నష్టం కలుగుతుందన్నారు. మండల అధ్యక్షులు పని చేయక పోతే,అవినీతి పాల్పడితే విచారణ జరిపి తొలగించాలన్నారు. కేవలం భజన పరులకు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఏంటని ప్రశ్నించారు.
బీజేపీ జెండా మోసే వారికి అన్యాయం చేసి, జై అరవింద్ అన్న వాళ్లకు పదవులు ఇస్తున్నారన్నారు. జై బీజేపీ అన్న వాళ్లకు పదవుల నుంచి తీసివేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర స్థాయిలో, ఎంపీ అరవింద్‌ను ఇదే విషయమై అడగగా మాకు తెలియకుండానే నియామకాలు చేశారని చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసిన నిజమైన బీజేపీ కార్యకర్తలను మండల అధ్యక్షులుగా నియమించాలని లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసనలో 13 మండలాల అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్ ఛార్జిలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: గిరిజన రిజర్వేషన్లపై సోయం బాపురావు కామెంట్స్.. కిషన్ రెడ్డి క్లారిటీ