- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ మెట్రోకు మరో జాతీయ అవార్డ్..
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలును మరో జాతీయ అవార్డు వరించింది. మెట్రో రైలు ప్రతిపాదనల స్థాయి నుంచి మొదలుకుని అగ్రిమెంట్, శంకుస్ఢాపన, నిర్మాణ దశ, పిల్లర్లు, వయోడక్ట్ల్‌ల కోసం ప్రత్యేక యార్డుల ఏర్పాటు, ప్రారంభోత్సవం వంటి ముఖ్యమైన దశలకు సంబంధించి సుమారు 2 వేల ఫొటోలు, 800 పేజీలతో రూపొందించిన ఫిక్చోరియల్ కాఫీ టేబుల్ బుక్ హైదరాబాద్ మెట్రో రైల్ అనే ఫొటో అల్బమ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఈ మేరకు ఆదివారం భోపాల్‌లో జరిగిన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ కాన్ఫరెన్స్‌లో మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కైలాష్ విశ్వాస్ సారంగ్ ఈ బహుమతిని హైదరాబాద్ మెట్రోరైల్ సీపీఆర్వో మల్లాది కృష్ణానంద్‌కు అందజేశారు. ఒక్క ఫొటో వెయ్యి పదాల్లో చెప్పే సారాంశాన్ని ప్రతిబింబిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ అల్ఫమ్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి సీపీఆర్వోను ప్రత్యేకంగా అభినందించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు గురించిన తెల్సుకోవాలన్న ఆసక్తి కల్గిన వారికి ఈ ఫొటో అల్బమ్ ఎంతో ఉపయోగపడుతుందని రెడ్డి వ్యాఖ్యానించారు.