లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి

by Satheesh |
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడికి స్టెమ్ క్యూర్స్ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో తయారీ ల్యాబ్‌ని ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ ల్యాబ్ ప్రధానంగా స్టెమ్ చికిత్సపై దృష్టి సారిస్తుంది. దేశంలోనే అతిపెద్ద స్టీమ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానుంది. దాదాపు 54 అమెరికన్ మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానుండగా, ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్‌తో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం చేసుకున్నారు.

అమెరికాలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని దేశానికి తీసుకువచ్చి తీవ్రమైన వ్యాధులకు స్టెమ్ సెల్ ఉత్పత్తులతో చికిత్సను అందించడమే ఈ కంపెనీ లక్ష్యం అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీ తో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు భారత్ లో విస్తృతంగా అందుబాటులోకి రావాలన్నారు. స్టెమ్ క్యూర్ సంస్థ ఏర్పాటుచేయనున్న ల్యాబ్‌తో దేశంలో ఈ చికిత్స విధానాలు అందరికి అందుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed