తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భూకంపం వచ్చే అవకాశం: NGRI శాస్త్రవేత్త

by Mahesh |
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భూకంపం వచ్చే అవకాశం: NGRI శాస్త్రవేత్త
X

దిశ, వెబ్ డెస్క్: బుధవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం(Earthquake) తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలను వణికించింది. దీంతో ప్రజలు ఏమైందో తెలియక ఆందోళనకు గురయ్యారు. అనంతరం ములుగు కేంద్రంగా స్వల్ప భూకంపం ఏర్పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపణలు వచ్చాయి. అయితే ఈ ప్రకంపణలు ముఖ్యంగా గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపాయి. కాగా భూ ప్రకంపణలపై NGRI శాస్త్రవెత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చేందుకు అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు వచ్చిన ప్రకంపణలతో పోలిస్తే.. తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయడం మంచిదని.. లేదంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed