- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దీపిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యకు పాల్పడిన వడ్ల దీపిక అనే విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు అక్కడ పోస్ట్మార్టం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు పోలీసులు ఉపక్రమించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. మృతురాలి తండ్రి జర్నలిస్టు వడ్ల వీరయ్య ఆసుపత్రి ఆవరణలో సొమ్మసిల్లి పడిపోయారు.
ఆయనను ఐసీయూలో చేర్చారు. డ్యూటీలో ఉన్న వైద్యుడు డాక్టర్ అమరేశ్వర్ ఆయనకు వైద్య సేవలు అందించారు వీరయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే తనను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వీరయ్య పట్టుబట్టారు. ఎందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదని వీరయ్య ప్రశ్నించారు. తన కూతురు మృతదేహం పోస్టుమార్టం నిర్వహించేందుకు గాను సమ్మతించాలని వైద్యులు కోరగా తెల్లవారుజాము నుంచి వీరయ్య అంగీకరించడం లేదు.
కేస్ షీట్‌పై సంతకాలు చేయాలని వీరయ్యను వైద్యులు ఎంతగా కోరిన ఆయన ఒప్పుకోవడం లేదు. దీంతో ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన కూతురు మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని దీపిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటి యాజమాన్యం పిల్లలను పట్టించుకోవడంలేదని క్యాంపస్‌లో విద్యార్థులు ఎవరు ఏం చేస్తున్నా వారిపై పర్యవేక్షణ లోపించిందని వారు ఆరోపించారు.
తన కూతురు మృతికి యాజమాన్యం బాధ్యత వహించాలని తండ్రి వీరయ్య డిమాండ్ చేస్తున్నారు. కాగా మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన ద్వారం మూసివేశారు పోలీసు బలగాలు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిఎస్పి జీవన్ రెడ్డి అక్కడే ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆసుపత్రి నుంచి ప్రైవేటుకు వెళ్తామని వీరయ్య కోరడంతో తమ విధిగా డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి నుంచి వీరయ్యను బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.