- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు మరో BIG షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ సాయంత్రమే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించగా.. రాత్రికి మరో బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రూపంలో తెలియజేసింది. అంతేకాదు.. లేఖలో బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిపోయిందని లేఖలో పేర్కొంది. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.