అన్నా రేవంతన్నా మమ్మల్ని కాపాడు.. ఆ విషయం సీఎంకి తెలిసేలా కొటేషన్లు

by Indraja |
అన్నా రేవంతన్నా మమ్మల్ని కాపాడు.. ఆ విషయం సీఎంకి తెలిసేలా కొటేషన్లు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆటో వెనక వైపు, లేదా ఆటో లోపల కొన్ని కొటేషన్స్ రాయడం చూసే ఉంటాం. నా ఆటో ఎక్కితే 123 దిగితే 143 ఇలాంటి ఫన్నీ కొటేషన్స్ సాధారణంగా ఆటోపై రాసి ఉంటాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారిందో లేక వాళ్ళ గోస ఇలా వెళ్లబుచ్చుకుంటున్నారో తెలీదుగాని.. ఓ ఆటో పై ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నట్లు ఓ కొటేషన్స్ అందరి చూపును ఆకర్షించింది.

మియాపూర్ పరిధిలోని బొల్లారం రోడ్డులో ఓ ఆటో పై అన్నా రేవంతన్నా జర మమ్మల్ని కాపాడు.. ఫ్రీ బుస్స్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడండి అని రాసి ఉంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాను అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాటప్రకారం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి తాను ఇచ్చిన మాట నిలుపుకున్నారు.అయితే ఓ వైపు ఉచిత బస్సు సౌకర్యం రావడంతో మహళలు ఆనందపడుతుంటే మరో వైపు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో తమకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలని ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టగా వాళ్లకు కేటీఆర్ మద్దతుగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే.

Advertisement

Next Story