అమృత్ పథకం టెండర్లను రద్దు చేసి..అవినీతి పై కేంద్రం విచారించాలి: మంత్రి కేటీఆర్

by Mahesh |
అమృత్ పథకం టెండర్లను రద్దు చేసి..అవినీతి పై కేంద్రం విచారించాలి: మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: అమృత్ పథకం టెండర్లలో అవినీతికి పాల్పడుతుందని.. ఈ అవినీతిపై కేంద్రం విచారణ చేయాలని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూ లకు శుక్రవారం లేఖలు రాశారు. ఇదే విషయంపై ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్రం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు సీఎం రేవంత్ రెడ్డి సొంత బావమరిది సుజన్ రెడ్డి(Sujan Reddy)కి చెందిన శోధ కంపెనీ(shodha company)కి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎటువంటి సంబంధం లేకుంటే వెంటనే కేంద్రం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకొని.. బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారని, రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ.. రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా.. అని ఈ సందర్భం కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే హైడ్రా ని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని, త్వరలోనే ఆధారాలతో ఎలా బెదిరిస్తున్నారో బయటపెడతామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తామని.. కేంద్రంలోని బీజేపీ తలుచుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి పదవి పోతుందని కేటీఆర్ అన్నారు.

Next Story

Most Viewed