- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OYO: అమెరికా విస్తరణలో OYO.. రూ.4 వేల కోట్లతో మరో హోటల్ బ్రాండ్ కొనుగోలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ దేశీయ కంపెనీ ఓయో(OYO) అమెరికాలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొత్త పెట్టుబడులు పెడుతుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ప్రముఖ లాడ్జింగ్ ఫ్రాంఛైజీ, మోటల్ 6, స్టూడియో 6 బ్రాండ్లను నడుపుతున్న జీ6 హాస్పిటాలిటీ సంస్థను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.4,382 కోట్లు($525 మిలియన్లు). భారత్‌లో అన్ని ప్రధాన నగరాల్లో హోటళ్లను కలిగి ఉన్న ఓయో(OYO), తన వ్యాపార విస్తరణలో భాగంగా 2019 లో అమెరికాలో అడుగుపెట్టింది. ప్రస్తుతం అక్కడ 35 రాష్ట్రాల్లో 320 హోటళ్లను నిర్వహిస్తోంది. ఒక్క 2023లోనే కంపెనీ అమెరికాలో కొత్తగా 100 హోటళ్లను తన వ్యాపారానికి జోడించింది. 2024 ఏడాదిలో మరో 250 హోటళ్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
OYO ఇంటర్నేషనల్ CEO గౌతమ్ స్వరూప్ మాట్లాడుతూ, ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా మా స్టార్టప్ కంపెనీని అంతర్జాతీయంగా బలోపేతం చేయడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ డీల్ ప్రక్రియ 2024 నాలుగో త్రైమాసికానికి పూర్తవుతుందని అంచనా. మోటల్ 6, అమెరికా, కెనడాలో దాదాపు 1,500కు పైగా హోటళ్ల ఫ్రాంచైజ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. G6 హాస్పిటాలిటీలో ప్రెసిడెంట్ ఆఫీసర్ జూలీ ఆరోస్‌మిత్ మాట్లాడుతూ, మోటెల్ 6 బ్రాండ్‌ను కొనసాగిస్తూనే OYO వినూత్నమైన ఆతిథ్య విధానం ద్వారా మా అతిథులకు ఆఫర్‌లను, గొప్ప విలువలను అందించవచ్చని అన్నారు.