నేషనల్ సేఫ్టీ అవార్డుకు ‘ఏఎంఆర్’ ఎంపిక..

by Kalyani |
నేషనల్ సేఫ్టీ అవార్డుకు ‘ఏఎంఆర్’ ఎంపిక..
X

దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల బ్లాక్-1 ఓపెన్ కాస్ట్ కాల్ మైన్ ప్రాజెక్ట్ ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ 2021 సంవత్సరానికి నేషనల్ సేఫ్టీ అవార్డుకు ఎంపికైనట్లు ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోల్ మైనింగ్ కార్మికులు సిబ్బందితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ప్రాజెక్ట్ అభివృద్ధే లక్ష్యంగా కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కృషి చేసినందుకు గాను ప్రాజెక్టు సిబ్బంది, కార్మికులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో జీరో ప్రమాదాల కారణంగా కోల్ మైనింగ్ జాతీయ సేఫ్టీ అవార్డుకు ఎంపిక కావడం మీ అందరి కృషి గర్వకారణమని ఆయన పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సీఎండీ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ చంద్రమౌలి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు ప్రాజెక్టు లో పనిచేస్తున్న అధికారులు, కార్మికులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ స్పూర్తినే ఇలాగే కొనసాగించాలని. రాబోయే రోజుల్లో మరింత రక్షణతో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని సూచించినట్లు తెలిపారు.

Advertisement

Next Story