- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ వేదికగా అమిత్ షా సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ అజెండా ఒక్కటే అని కీలక ఆరోపణలు చేశారు. వ్యూహాత్మకంగా మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని అన్నారు. వారి ప్రధాని లక్ష్యం బీజేపీ, మోడీని ఓడించడమే అని తెలిపారు. ఎమ్ఐఎమ్ చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కీలుబొమ్మలుగా మారాయని వెల్లడించారు.
కుటుంబాల చేతిలో ఉన్న ఆ పార్టీలు ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు కోరుకోవు అని అన్నారు. కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడుతున్నాయని తెలిపారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా అని అమిత్ షా ప్రకటించారు. ఆ జాబితాపై సమాధానం చెప్పినాకే బీజేపీపై విమర్శలు చేయాలని సూచించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులకు షా దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజలంతా మరోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మరోసారి రానున్నది బీజేపీయేనని సమావేశంలో షా ధీమా వ్యక్తం చేశారు.