- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరామనవమికి తెలంగాణకు అమిత్షా?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలంగాణకు విచ్చేయనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. రామనవమి సందర్భంగా ఏప్రిల్10వ తేదీన భద్రాచలం సీతారాముల కల్యాణానికి అమిత్షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించుకునే అవకాశాలున్నాయి. అదేరోజు హైదరాబాద్లో పలువురు మేధావులతో భేటీ అవుతారని సమాచారం. బీజేపీలో చేరే కీలక నేతలతో సైతం చర్చలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్14వ తేదీన గద్వాల జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనన్న రెండో విడుత ప్రజా ప్రస్థాన యాత్ర ప్రారంభోత్సవానికి సైతం అమిత్షా హాజరుకానున్నారు. గతంలో అమిత్షా రెండుమార్లు తెలంగాణలో పర్యటనలు చేస్తానని స్పష్టం చేశారు. ఒకే నెలలో రెండు పర్యటనలు ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.