- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండిపై అమిత్ షా ప్రశంసలు.. మిగతా రాష్ట్ర నేతలపై ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ వరుస కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. కేంద్రంలోని బీజేపీ నిర్ణయంతో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ సైతం సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ముందుకు కదిలారు. దీంతో ఈ విషయంలో కేసీఆర్‌ను బీజేపీ మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే విషయంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి శనివారం రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ కోర్ కమిటీ మీటింగ్ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్‌లో అనేక అంశాలపై వాడీవేడీ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై అమిత్ షా మరోసారి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ప్రజాసంగ్రామ యత్రకు మంచి స్పందన వస్తోందని మిగతా నేతలు సైతం ప్రజల్లో ఉండాలని అమిత్ షా సూచించినట్లు టాక్. మునుగోడు ఉప ఎన్నికపై మరింత ఫోకస్ పెంచాలని నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం త్వరలో పార్టీ తరపున కమిటీ నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో అమిత్ షా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఐక్యత కొరవడినట్లు తన వద్ద సమాచారం ఉందని వెంటనే తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో పార్టీ పట్ల ఆసక్తి ఉందని అయితే నాయకులు మరింత కష్టపడకుంటే ఆశించిన ఫలితం సాధించలేమని చెప్పినట్లు తెలుస్తోంది.