- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ అంశంపై అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీట్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వద్ద బుధవారం రాత్రి హై టెన్షన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 500 మంది పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే టీఎస్పీఎఫ్ సిబ్బంది ఏపీ పోలీసులు అడ్డుకోగా స్వల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు.
అయితే ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇదే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కావాలనే కేసీఆర్ కు లబ్ధి చేకూరేలా ఇలా వైసీపీ ప్లాన్ చేసిందని మండిపడుతున్నారు.
Read More..
వ్యూహాత్మకంగానే వివాదం.. నాగార్జున సాగర్ ఇష్యూపై రేవంత్ రియాక్షన్