- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించిన ‘ఐక్య వేదిక’
దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది వేడుకల పేరుతో 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నారు. పలు రాజకీయ పార్టీలు ఈ వేడుకలను విడివిడిగా జరుపుకుంటున్నా తెలంగాణ అమరవీరుల-ఉద్యమకారుల ఐక్య వేదిక మాత్రం బహిష్కరిస్తున్నది. రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ కూడా బహిష్కరిస్తున్నది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా జరుపుకోవడం లేదంటూ ఓయూ జేఏసీకి మద్దతు పలికారు. తొలుత బహిష్కరిస్తున్నట్లు గత నెల 27న ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చివరకు జరుపుకుంటున్నట్లు జూన్ 1న ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకల్లో పాలు పంచుకోవడంలేదు. పార్టీ కార్యాలయంలో విడిగానూ జరుపుకోవడంలేదు. ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నది.