రైళ్ల హాల్టింగ్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-05-15 05:21:15.0  )
Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహబూబ్‌నగర్, షాద్ నగర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఆదివారం లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే శాఖల ఆధ్వర్యంలో గణనీయమైన పురోగతి జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే శాఖలో మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా రూ.1,410 కోట్లతో 85 కిలోమీటర్ల పొడవున సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య ఏర్పాటుచేసిన డబ్లింగ్ రైలు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

కాగా యశ్వంత్పూర్-హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు(12649/12650) కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ రైలును మహబూబ్‌నగర్ లో హాల్టింగ్ కు అనుమతించాలని కోరారు. తద్వారా ఢిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. అంతేకాకుండా చెంగల్ పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్(17651/17652) కు షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లోని ప్రజలతో పాటు ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More: తెలంగాణలో వచ్చేది ఇక రామ రాజ్యమే : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Advertisement

Next Story

Most Viewed