BREAKING: తీవ్ర ఉత్కంఠకు తెర.. ఎట్టకేలకు బండి, కిషన్ రెడ్డిలకు శాఖలు కేటాయింపు

by Satheesh |   ( Updated:2024-06-10 14:42:59.0  )
BREAKING: తీవ్ర ఉత్కంఠకు తెర.. ఎట్టకేలకు బండి, కిషన్ రెడ్డిలకు శాఖలు కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా తాజాగా వీరిద్దరికి కేంద్ర ప్రభుత్వం పోర్ట్ ఫోలియోలు కేటాయించింది. గత మోడీ ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి ఈ సారి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. ఫస్ట్ టైమ్ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుండి కేంద్రమంత్రిగా చాన్స్ కొట్టేసిన తెలుగు దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కీలకమైన పౌరవిమానయాన శాఖ దక్కింది. దీంతో తెలుగు రాష్ట్ర ఎంపీలకు మోడీ కేబినెట్‌లో ఏ పోర్ట్ ఫోలియోలు దక్కుతాయోనన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది.

నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖలు:

అమిత్ షా= కేంద్ర హోంశాఖ

నితిన్ గడ్కరీ= రవాణా శాఖ

రాజ్‌నాథ్‌= రక్షణశాఖ

మనోహర్‌లాల్‌ కట్టర్‌= గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి

హర్దీప్‌సింగ్‌ పూరి-పెట్రోలియం,

అశ్విని వైష్ణవ్‌-రైల్వే, సమాచార, ప్రసారశాఖ,

పీయూష్‌ గోయల్‌- వాణిజ్యం

ధర్మేంద్ర ప్రధాన్‌-విద్యాశాఖ

నిర్మలాసీతారామన్‌= ఆర్థికశాఖ

జయశంకర్‌= విదేశాంగ శాఖ

జ్యోతిరాదిత్య సింధియా-టెలికాం శాఖ

ప్రహ్లాద్‌ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు

కుమారస్వామి-ఉక్కు, భారీ పరిశ్రమలు

సురేష్‌ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి

రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌-సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి

కిషన్ రెడ్డి= బొగ్గు గనుల శాఖ

బండి సంజయ్= కేంద్ర హోంశాఖ సహయ మంత్రి

రామ్మోహన్ నాయుడు= పౌరవిమానయాన

Advertisement

Next Story

Most Viewed