ఆల్ టైమ్ రికార్డ్.. 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేశారా..!

by Disha Web Desk 12 |
ఆల్ టైమ్ రికార్డ్.. 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేశారా..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చిన సరే ముక్క, సుక్క కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా మందు లేనిదే తెలంగాణలో ఏ కార్యం ముందుకు సాగదు. గడిచిన పది సంవత్సరాల్లో అయితే ఇది మరింత పెరిగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, జల్సాలకు అదిక ప్రాదాన్యాత ఇస్తుండటంతో మద్యం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యం పై వచ్చే ఆదాయం దాదాపు 30 వేల కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తుంది. రానున్న కాలంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలు సరదా సరదాకే బీర్లు తాగుతారు.. అలాంటిది ఎండలు మండిపోతున్నాయి చూస్కో మరి.. మా కెపాసిటీ ఏంటో చూపిస్తామ్ అంటున్నారు. ఈ నెల 1 నుంచి మార్చి 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగి బీర్ల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఎండలు అంతంత మాత్రంగా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతాతో అంచనా వేయవచ్చు. కాగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తుంది.



Next Story

Most Viewed