బస్సులన్నీ సీఎం సభకు.. వివిధ ప్రాంతాల ప్రయాణికుల అవస్థలు

by Kalyani |
బస్సులన్నీ సీఎం సభకు.. వివిధ ప్రాంతాల ప్రయాణికుల అవస్థలు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టర్, ఎస్పీ, మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. అలాగే సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలను పెద్ద మొత్తంలో తరలించేందుకు ఆర్టీసీ బస్సులు గ్రామాలకు ఏర్పాటు చేశారు. అదే నేపథ్యంలో అచ్చంపేట డిపోలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ 74 బస్సులు ఉండగా వాటిలో సుమారు 50 బస్సులు సీఎం సభకు బుక్ చేసుకున్నారని తెలిసింది.

అలాగే పక్క జిల్లా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డిపో నుంచి కూడా సభకు ఏర్పాటు చేశారు. తద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు, హైదరాబాద్, పాలమూరు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story