- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నష్టపోయిన రైతులందరికీ పరిహారమివ్వాలి
దిశ, తెలంగాణ బ్యూరో : రెండు నెలల వ్యవధిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో సుమారు 10 లక్షల ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహార సాయాన్ని అందించాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. ప్రభుత్వ వర్గాలే 10 లక్షల ఎకరాల్లో నష్టమని చెప్తున్నదని, కానీ జీవో మాత్రం కొంత వరకే పరిమితం చేసిందని, తగిన సవరణలు చేసి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని పేర్కొన్నది. వివిధ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో లోతుగా చర్చించిన వేదిక... ఎనిమిది డిమాండ్లతో వ్యవసాయ మంత్రికి ఓపెన్ లెటర్ రాసింది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు నష్టపోయిన రైతుల్లో కౌలుదారులు కూడా ఉన్నందున వారికి కూడా సాయమందేలా బ్యాంకు ఖాతాల నెంబర్లను తీసుకుని పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ చొరవ తీసుకోవాలని పేర్కొన్నది. ప్రభుత్వ అలసత్వం కారణంగానే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడిచిపోతున్నదని, రైతులకు నష్టం కలిగిందని, తేమ శాతంతో సంబంధం లేకుండా మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత ప్రాతిపదికన పర్చేస్ సెంటర్లలో పక్కా ఏర్పాట్లు చేయాలన్నది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో పంటను నష్టపోయిన రైతులకు హైకోర్టు ఆదేశాల మేరకు విపత్తు సాయాన్ని అందించాలని డిమాండ్ చేసింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురవుతున్న రైతులకు తగిన పరిహారాన్ని అందించాలన్నది.