నేటి నుంచి ఆల్​ఇండియా హార్టీకల్చర్​ మేళా

by M.Rajitha |
నేటి నుంచి ఆల్​ఇండియా హార్టీకల్చర్​ మేళా
X

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ ఉత్పత్తులతో గురువారం నుంచి గ్రాండ్‌ నర్సరీ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు మేళా ఇన్​చార్జి ఖలీద అహ్మద్ తెలిపారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు నుంచి సెప్టెంబరు 2 తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళాను సందర్శించవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రత్యేక బ్రౌచర్ ను ఆవిష్కరించారు. ఈ మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, హార్టీకల్చర్​ డైరెక్టర్​​షేక్​ యాస్మీన్​ బాషా ప్రారంభించనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను షోలో ప్రదర్శిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్​తో 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Next Story

Most Viewed