- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేష్ మండపాల కరెంట్ ఖర్చంతా నేనే భరిస్తా ! బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: గణేష్ చవితిని పురస్కరించుకొని గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా తానే భరిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. గణేష్ చవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్షలో పాల్గొన్నారు. తదనంతరం సంజయ్ మాట్లాడుతూ.. "గణేష్ నిర్వాహకులకు తాను విజ్ఞప్తి చేసేది ఒకటే.! తాను 30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నానని, ఈ సారి గణేష్ మండపాలకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని, మీరు చవితిని పురస్కరించుకొని నవరాత్రి దీక్షలు చేపట్టాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే గణేష్ మండపాల ఖర్చు మాత్రం కేవలం కరీంనగర్ వాసులకే అని తెలుస్తోంది. విద్యుత్ శాఖ, మండప నిర్వాహకులను ఇబ్బంది పెట్టకూడదని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు సంజయ్. నిమజ్జనం ఒక్కరోజే కాకుండా నవ రాత్రులు మొత్తం వారికి కనీస సౌకర్యం కల్పించాలని తెలిపారు. దీంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉండాలని, ప్రత్యేకంగా అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాము" అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.