తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. బంగాళఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం..

by Mahesh |   ( Updated:2024-09-04 16:01:41.0  )
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. బంగాళఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం..
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఎక్కడ చూసిన వరదలు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. అయితే సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అప్ డెట్ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోను భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే చాలా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండటం గమనార్హం. కాగా ఇదిలా ఉంటే బుధవారం అర్ధరాత్రి(ఉదయం 12 గంటల సమయంలో) భారీ వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జూబ్లీహిల్స్, ఈసీఐఎల్, మలక్ పేట్, మాదాపూర్ కూకట్ పల్లి, అల్వాల్, ఎల్బీనగర్ సికింద్రాబాద్, ఖైరతాబాద్, సంగారెడ్డి, కాప్రా, మేడ్చల్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

Advertisement

Next Story

Most Viewed