అలర్ట్ : SI, కానిస్టేబుల్ తుది ఫలితాలు అప్పుడే..

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 03:59:10.0  )
అలర్ట్ : SI, కానిస్టేబుల్ తుది ఫలితాలు అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో తుది ఫలితాల వెల్లడిపై టీఎస్ఎల్పీఆర్బీ కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ లో విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. అనుకున్నట్లు అంతా సాగితే ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. గత నెల 12న ప్రారంభమైన తుది రాత పరీక్షలు ఈనెల 30 నాటికి ముగియనున్నాయి. లక్షల్లో ఉన్న మూల్యాంకనం పూర్తి చేసేందుకు మే నెల పట్టే ఛాన్స్ ఉంది. టీఎస్పీఎస్సీ, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ దుమారం రేపగా, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఎల్పీఆర్బీ ఉన్నతాధికారులు మూల్యాంకనాన్ని పకడ్భందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story