ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-09 06:28:06.0  )
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో తొలుత కిషన్ రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సన్మానించారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో ప్రజా సమస్యలపై డిస్కస్ చేశారు. అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనుండగా బీజేపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More: ప్రొటెమ్ స్పీకర్‌ ఎంపిక సరిగ్గా లేదు: కిషన్ రెడ్డి

Advertisement

Next Story