అశోక్‌నగర్‌లో ఆందోళన.. 10 మంది నిరుద్యోగులు అరెస్టు

by Anjali |
అశోక్‌నగర్‌లో ఆందోళన.. 10 మంది నిరుద్యోగులు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి నిరుద్యోగులను కించపరిచేలా మాట్లాడటంలో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ధర్నాలు చేస్తున్నారని, అభ్యర్థుల నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌తోపాటు, ఇతర అనేక చోట్ల వేలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాంగ్రెస్‌ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తక్షణమే గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు కూర్చున్న చెట్టును వాళ్ళే నరుక్కుంటున్నారని నిప్పులు చెరుగుతున్నారు. 1:100 కి పెంచుతామని చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు ఒకదానికి ఒకటి సమయంలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్లుకు వంద కోట్లు వస్తాయి అనుకుంటే.. నువ్వు గవర్నమెంట్ ద్వారా పెట్టి నడుపు అంటూ ఇవాళ ఉదయం 3 గంటల సమయం వరకు అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 10 మంది నిరుద్యోగులను అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుండి నిరుద్యోగులను లాక్కొచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed