- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాళ్లతో కలిసి నేను కూర్చోలేను: ఎంపీ కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ షోకాజ్ నోటీస్‌ను ఏనాడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. నోటీసులు ఏమీ లేవని, తన పని తాను చేసుకోవాలని మల్లికార్జున ఖర్గేనే తనతో చెప్పారని అన్నారు. థాక్రే చాలా మంచి వారని ఆయన గురించి తనకు, తన గురించి ఆయనకు బాగా తెలుసన్నారు. నియోజకవర్గం పనుల్లో బీజీగా ఉండటం వల్లే నిన్న గాంధీ భవన్‌కు రాలేదన్నారు. జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క వంటి వారు కూడా నిన్న గాంధీ భవన్‌కు రాలేదని వాళ్లు రాలేదని ఎందుకు అడగరని మీడియాను ప్రశ్నించారు. గంట పాటు సాగిన భేటీలో భవిష్యత్‌లో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేదానిపై తాను కొన్ని అభిప్రాయాలను థాక్రేతో పంచుకున్నానని మా ఇద్దరి మధ్య పార్టీ గురించే చర్చ జరిగిందన్నారు. పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై మరోసారి స్పందించిన వెంకట్ రెడ్డి ఆ కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. ఆరేడు సార్లు ఓడిపోయిన వారితో నేను పీఏసీలో కమిటీలో కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన వారిని పట్టించుకోవడం లేదని, పీసీసీ కమిటీలను ప్రక్షాళన చేయాలని థాక్రేను వెంకట్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది.