Delhi Tour: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. కాన్వాయ్‌లో తన నివాసానికి పయనం

by Ramesh N |
Delhi Tour: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. కాన్వాయ్‌లో తన నివాసానికి పయనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం హస్తినకు వచ్చారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి పయనమయ్యారు. ఇవాళ రాత్రి లేదా సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నట్లు తెలిసింది.

కాగా, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు అవుతున్న క్రమంలో వరంగల్‌లో క‌ృతజ్ఞతసభ నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేసింది. అయితే, ఆ సభకు రాహుల్‌ గాంధీని అహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంత కలిసి రాహుల్‌తో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నియామకాలపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కూడా కలిసి సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story