TSPSC అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిలీజ్

by Satheesh |
TSPSC అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల హాల్ టికెట్లను మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ గడువు ఈ నెల 9వ తేదీన పరీక్ష నిర్వహణకు 45 నిమిషాల ముందు వరకే అవకాశం ఉందని విద్యార్థులకు బోర్డు సూచించింది. ఈ పరీక్షలను ఈ నెల 8, 9 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

ఆయా తేదీల్లో రెండు షిఫ్ట్‌లలో ఈ ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ ఎగ్జామ్ నిర్వహణ ఉంటుందని అభ్యర్థులకు సూచించింది. అయితే ఈ పరీక్షలు అన్‌లైన్‌లనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులకు మాక్ టెస్ట్‌లు రాసుకునే అవకాశం కల్పించారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో లింక్ ఉంటుందని టీఎస్పీఎస్సీ సూచించింది.

Advertisement

Next Story