కేసుల్లో సీఎం కేసీఆర్ నెంబర్ వన్.. వెలుగులోకి సంచలన నివేదిక

by Javid Pasha |
కేసుల్లో సీఎం కేసీఆర్ నెంబర్ వన్.. వెలుగులోకి సంచలన నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయ నేతలపై కేసులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) సంచలన నివేదిక విడుదల చేస్తోంది. అన్ని పార్టీల రాజకీయ నేతలపై ఉన్న కేసులపై రిపోర్ట్ తయారుచేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ కేసుల్లో నెంబర్ వన్‌గా నిలిచారు. కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులు ఉండగా.. వీటిల్లో సీరియస్ ఐపీఎస్ సెక్షన్ 37 నమోదైనట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఇక ఇతర సెక్షన్లు 283 కేసీఆర్‌పై నమోదయ్యాయి.

119 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఇందులో 59 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 119 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులో ఉండగా.. 46 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story