- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ప్రకటించిన ADR.. తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను ప్రకటించింది. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించిన ఈ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 54, 545. కాగా, ఇందులో తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 1601 కోట్లు అని ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ రిపోర్ట్ తేల్చింది.
ఈ రూ.1601 కోట్ల ఆస్తుల్లో 103 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.1443 కోట్లు అని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం రూ.1601 కోట్ల ఆస్తులతో తెలంగాణ ఎమ్మెల్యేలు దేశంలో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆస్తుల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్నాటక టాప్‌లో నిలిచింది. కర్నాటకలోని 223 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 14, 359 కోట్లు. ఇక, ఈ నివేదికలో రూ.6679 కోట్లతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, 4914 కోట్లతో మూడవ స్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు నిలిచారు. అంతేకాకుండా దేశంలోని మొత్తం 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234 కోట్లుగా కాగా.. దేశంలోని మొత్తం 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు 15, 798 కోట్లుగా ఏడీఆర్ నివేదిక తేల్చింది.