- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యా సంస్థల సొసైటీలోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 8న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని సోసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. కౌన్సిలింగ్ వివరాలు కేటగిరీల వారీగా వెబ్ సైట్ (https://mjptbcwreis.telangana.gov.in) లో ఇచ్చామని, దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలు పూర్తి వివరాల కోసం వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు.
అగ్రిసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి రెండో విడత కౌన్సెలింగ్, ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంసెట్, అగ్రిసెట్‌లో వచ్చిన ర్యాంక్‌తో పాటు గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఈ కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని ఆయన సూచించారు. వెబ్ సైట్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని డాక్టర్ మల్లయ్య బట్టు సూచించారు.