- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు తెలంగాణని బార్ల తెలంగాణగా మలిచిన ఘనత కేసీఆర్ ది : వైఎస్ షర్మిల
దిశ, ముధోల్ : బంగారు తెలంగాణని బార్ల తెలంగాణగా మలిచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో రెండవ రోజు ప్రజాప్రస్థాన యాత్రను బైంసా మండలం మాటేగాం నుండి ప్రారంభించింది. బైంసా మండలం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ టీపీ పార్టీని పెట్టామన్నారు. దళితబంధు ఎంతమంది నిరుపేదలకు అందుతుందని మండిపడ్డారు.
ఇది కేవలం అనుచరుల బందు అంటూ ఎద్దేవవా చేశారు. ప్రతి ఒక్క సంక్షేమపథకాన్ని మొదట ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి దక్కుతుంది, ఇప్పటికీ నిరుద్యోగ యువతకి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు లేవంటూ అన్నారు. రైతు రుణమాఫీ ఇప్పటికి చేయడం లేదంటూ మండిపడ్డారు. ప్రజలు రానున్నఎన్నికల్లో తమ ఓటుని అభివృద్ధి చేసే వారికి వేయాలని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ పార్టీ ఆదిలాబాద్ కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్, ముధోల్ కోఆర్డినేటర్ బెజ్జంకి ముత్యం రెడ్డి , పార్టీనాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.