- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM : గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే ముందుండే విధంగా చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశానని తెలిపారు. గత ఏడాది మార్చి 16 న పిప్రి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించానన్నారు. ఈ ఏడాది మార్చి 16న ఇక్కడే సభ పెట్టాలనుకున్నామని, కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది సాధ్యం కాలేదన్నారు. ఇక్కడ ఈ రోజు నిర్వహించే సభకు ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం..
తుమ్మడి హెట్టి ప్రాజెక్టు ఆగిపోయింది.. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు అందడం లేదు... మరో నాలుగు ఐదు నెలల్లోనే నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోనే తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. చిక్ మాన్, కుప్టి, పులిమడుగు ప్రాజెక్టు లకు నిధులిస్తామని పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాట నాకు గుర్తుందన్నారు. కుప్టి ప్రాజెక్టుతో పాటు మూడు, నాలుగు నెలల్లో చనాక, కొరాట ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. చిక్మాన్ ప్రాజెక్టులను కూడా సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రూ. 45 కోట్లు వెచ్చించి పిప్రిలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభిస్తామన్నారు. పిప్రిలో అంబేద్కర్ భవన్ కు నిధులు కేటాయిస్తామని చెప్పారు. తేజాపూర్,బుగ్గారం లిఫ్టు ఇరిగేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మంచిర్యాలకు కరకట్ట నిర్మాణం
వరదల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం మునిగిపోతోందని, దాని కోసం కరకట్ట నిర్మాణం చేపడతామని, వాటికి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నన్ను నడిపించిన మీకోసం ఇచ్చిన మాట నిలబెట్టు కుంటామన్నారు. అధికారం అనుభవించడానికి కాదని, అది ఒక బాధ్యత అని భట్టి గుర్తు చేశారు. పదేండ్లలో ఐటీడీఏలను నిర్వీర్యం చేశారని, ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు రూ. 17వేల కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసేందుకు రూ. 35 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాము. పాత పథకాలన్నిటిని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. పదేండ్ల పాటు పరిపాలించిన వారు ఐటీడీఏ లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గతంలో గిరిజనులకు భూమి, కరెంటు ఐటీడీఏ ల ద్వారా సమకూరేదని పదిహేనేళ్లుగా ఐటీడీఏ ల ద్వారా ఏమి అందడం లేదని పాదయాత్రలో మెస్రం జాతి గిరిజనులు వివరించిన విషయాన్ని తెలిపారు.
పాదయాత్రలో మీ కష్టాలు నా గుండెను తాకాయి..
తన పాదయాత్ర సందర్భంగా ఆదివాసుల కష్టాలు, పేద ప్రజల సమస్యలు పాదయాత్రలో తన గుండెను తాకాయని, ప్రజల ఆకాంక్షలు క్రమంగా నెరవేరుతున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆదిలాబాద్ జిల్లా పాదయాత్ర నాంది పలికిందని చెప్పారు. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నామని, తాను బస చేసిన ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మాదని మరోమారు స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూములకు పట్టాలిస్తామని, చేతులు పట్టుకొని మీ భూములు దున్నిస్తామని హామీ ఇచ్చారు. రుణాలు సైతం ఇస్తామన్నారు. భూ పోరాటాల ద్వారా సంక్రమించిన భూములపై హక్కులు తిరిగి వారు పొందేందుకు ప్రజల మధ్య చర్చ జరగాలి.. అసెంబ్లీ లోను చర్చ జరిపిస్తాం.. అందరి ఆమోదంతో సమగ్ర భూ చట్టం తెస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ లకు జిల్లా ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడమ బొజ్జు, పాయల్ శంకర్, కార్పొరేషన్ చైర్మన్ కోట్నక్ తిరుపతి, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, కొక్కిరాల విశ్వప్రసాద్, జిల్లా కలెక్టర్ రాజర్షీ షా, జిల్లా ఎస్పీ గౌస్ అలాం, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కుష్బూ గుప్తా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.