- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ నెల 21, 22 తేదీలలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ
by Sridhar Babu |

X
దిశ, మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో క్యాజువాలిటీ మెడికల్ అధికారి పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు ఈనెల 21, 22 తేదీలలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ. సులేమాన్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలోని క్యాజువాలిటీ విభాగంలో 5 క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులలో సీఎంఓ, ఆర్.ఎం.ఓ.గా విధులు నిర్వహించేందుకు ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారికి ఈనెల 21, 22 తేదీలలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story