- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పౌరులు ఓటు హక్కు కలిగి ఉండాలి : జిల్లా పాలనాధికారి ముషారఫ్ పార్కుఖ్
దిశ, ఖానాపూర్ : జిల్లాలోని పౌరులు ఓటు హక్కు కలిగి ఉండాలని అందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫరూక్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ శనివారం రోజున ఖానాపూర్ మండలంలోని పాతతర్లపాడ్, తర్లపాడ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పోలింగ్ బూత్, పోలింగ్ కేంద్రాలలో రిజిస్టర్ లలో నమోదు చేసిన పేర్లను పరిశీలించి, తగు సూచనలు చూసించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, యువతి, యువకులతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లను ఓటర్లుగా నమోదుచేయాలని ఆయన అన్నారు. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బీఎల్ఓలు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని చేసించారు. పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ బొడ్కరే, తహిసీల్దార్ డి.రాజమోహన్, బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.