- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నస్పూర్‌లో తీన్మార్ మల్లన్న పర్యటన..
దిశ, నస్పూర్ : నస్పూర్ పట్టణంలో ఆదివారం తీన్మార్ మల్లన్న పర్యటించారు. మొదటగా సిసిసి నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాలవేసి అక్కడి నుండి సింగరేణి కార్మికుల క్వార్టర్స్‌లో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షిర్కే చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన అవినీతిని ఎండగట్టారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి మన ఓట్లతో గెలిచి మనకు పని చేయకపోతే రీకాల్ సిస్టం ద్వారా వారిని గద్దె దించే హక్కు కోసం పోరాడుతున్నానని.. నా ఈ పోరాటంలో నాకు మద్దతు తెలపడానికి 90360 81100 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. అనంతరం అక్కడి నుండి వెళ్తుండగా వెంకటేశ్వర టెంపుల్ వద్ద హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ నాయకుడు తిరుపతి.. సింగరేణిలో మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల వద్ద నుండి లక్షల రూపాయలు దండుకొని సాదాసీదా కార్మికులను అన్ఫిట్ చేయకుండా యూనియన్ సంఘాలు అవినీతికి పాల్పడుతున్నాయని తీన్మార్ మల్లన్నకు తెలిపారు.
- Tags
- Teenmar Mallanna