గోడ్సార్‌లో వరుస నీటి ప్రమాదాలు.. ముగ్గురు మృతి

by Hamsa |
గోడ్సార్‌లో వరుస నీటి ప్రమాదాలు.. ముగ్గురు మృతి
X

దిశ, కుబీర్: ఆశ్చర్యం అనుమానాలతో కూడిన వరుస సంఘటనలు గ్రామంలో నెలల వ్యవధిలోనే చోటు చేసుకుంటూ ఉండడంతో అనుమానాలు తలెత్తక మానవు. ఊహించనంత దురదృష్టకరమైన సంఘటనలు ఒకదాని వెనక ఒకటి జరుగుతుండడంతో అయోమయం కలగక మానదు. ఆ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కుబీర్ మండలంలోని గోడ్సార్ గ్రామం. కుబీర్ బైంసా రాజధాని పక్కనే ఉన్న ఊరు ఇది. వారం రోజుల్లోనే ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి కూడా నీటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మూడు నెలల్లో ముగ్గురు నీటి ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారే. ఇందులో ఇద్దరు తండ్రి కొడుకులు. మరొకరు ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దత్త హరి అనే వ్యక్తి 3 నెలలకు క్రిందట చెరువులో పశువులకు కడగడానికి వెళ్లి బురదలో ఇరుక్కుని చనిపోయాడు. ఇతని కుమారుడే సందేశ్ అనే బాలుడు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పదంగా ఇటీవల మృతి చెందాడు.

ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవకముందే శనివారం మధ్యాహ్నం దత్త హరి అనే పేరు గల మరో వ్యక్తి తల్లి భార్యతో కలిసి మధ్యాహ్నం వరకు వ్యవసాయ పనులు చేసి కాలకృత్యాల తీర్చుకునేందుకు వచ్చి వాగులో పడి మృతి చెందాడు. ఇద్దరు యువకులు, ఒక బాలుడు, వరుసగా ప్రమాదాల బారిన మృతి చెందారు. బావిలో , వాగులో, చెరువులోను, నీటి ప్రమాదాల బారినే పడ్డారు. ఒక సంఘటన నుండి కోలుకోకముందే వరుస సంఘటనలు జరుగుతుండడంతో ఆ కుటుంబాలతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తుల ఆందోళన తోలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed