- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
దిశ, మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వరకు అంగన్వాడీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు . ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు భానుమతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీత ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించే టువంటి ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం అనేది సరైనది కాదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత , రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్ యాప్‌ల పేరుతో అంగన్వాడీ ఉద్యోగుల పైన పని భారం మోపుతున్నారని, గత 30 ఏళ్ల కిందట కట్టినటువంటి అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.
ఇప్పుడు అదే కేంద్రాల్లో పిల్లలని ఉంచుతూ పాఠశాల నడిపించడం అంటే చాలా భయంగా ఉంది. కాబట్టి శిథిలావస్థలో ఉన్న భవనలకు సొంత భావనలను నిర్మించాలని, సెంటర్‌లకు ప్రభుత్వం సరఫరా చేసేటటువంటి సరుకులు నాణ్యతగా సమయానికి కేంద్రాలకు చేర్చడంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్నారు. కావున నాణ్యమైన టువంటి సరుకులు కేంద్రాలకు సకాలంలో పంపిణీ చేయాలనీ కోరారు . అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరైనది కాదని, ముందుగా అంగన్వాడీ కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరాలు, బయోమెట్రీకులు కాదని అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదేదీ చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించే ఆలోచనలు విరమించుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు, పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుంపల రంజిత్ కుమార్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.