Commissioner of Police : పోలీసుల‌కు ఫోన్ రాగానే వెంటనే స్పందించాలి

by Sridhar Babu |
Commissioner of Police : పోలీసుల‌కు ఫోన్ రాగానే వెంటనే స్పందించాలి
X

దిశ‌, మంచిర్యాల : డయల్ 100,112 కాల్ వచ్చిన వెంటనే స్పందించి తొందరగా సంఘటన స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప‌రిధిలో డయల్ 100,112 కాల్స్ పై స్పందన వారి పనితీరు పై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయవ‌ద్ద‌న్నారు. స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ రద్దీ ప్రాంతాల్లో, విసబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు.

సమస్యాత్మక, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను ఎస్ హెచ్ ఓ లు సందర్శించాలన్నారు. ఆపదలో ఉన్న బాధితులు పోలీసుల సాయం కోసం డయల్ 100 కి ఫోన్ చేస్తారని ప్రతి పోలీసు గుర్తించాలని చెప్పారు. డయల్ 100,112 వచ్చే ఫోన్ కాల్ విషయంలో ఎస్ఐ, సీఐ, ఏసీపీలు పర్యవేక్షించాలన్నారు. డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత పోలీసులు తొందరగా సంఘటన స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స‌మావేశంలో డీసీపీలు చేతన, భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed