మొండి బకాయిల వసూలుకు సిబ్బందికి సహకరించాలి.. డీసీఓ తారమని

by Sumithra |
మొండి బకాయిల వసూలుకు సిబ్బందికి సహకరించాలి.. డీసీఓ తారమని
X

దిశ. బెజ్జుర్ : మొండిబకాయల వసూలుకు సిబ్బందికి పాలకవర్గ సభ్యులు సహకరించాలని జిల్లా కోపరేటివ్ అధికారి తారమని తెలిపారు. శుక్రవారం బెజ్జూరు సంఘం కార్యాలయంలో చైర్మన్ ఓం ప్రకాష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం ఆదాయ వ్యయాలు పరిశీలించి ఆమోదించారు. సంఘంలో పేరుకుపోయిన మొండిబకాయలు వసూలు చేయటానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి డీఆర్ ఆదిలాబాద్ ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సంఘం పరిధిలోని గ్రామాలకు 400 టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు.

సంఘంలో చేరిన నూతన పాలకవర్గ సభ్యుల సభ్యత్వాలను పరిశీలించి వారికి పంట రుణాలు ఇచ్చేందుకు తీర్మానించారు. బెజ్జూరు మండలంలో మరో ధాన్యం కొనుగోలు కేంద్రంగా బారేగూడను ఏర్పాటు చేయటానికి డీసీఓని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సంఘ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, సీఈవో వర్ష సంజీవ్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed