- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తుని బంగారు మాయం చేసుకోవాలి : సీఐ మొగిలి
దిశ, ఉట్నూర్ : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తు ని బంగారు మాయం చేసుకోవాలనీ సీఐ మొగిలి సూచించారు. శ్రీపులాజీ బాబా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కల్చర్ ఫెస్ట్ ను స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ మొగిలి, ఎస్సై మనోహర్, కళాశాల డైరెక్టర్ రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. విద్యార్థుల సంస్కృతి, సాంప్రదాయ, గేయ, సినీ పాటలపై చేసిన డ్యాన్సులు పలువురి విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అనంతరం సీఐ మొగిలి మాట్లాడుతూ విద్యార్థుల మంచి చెడు ప్రభావం చూపే వయస్సు ఇదేనన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని తద్వారా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
సెల్ ఫోన్ ను వైజ్ఞానిక విషయాల కోసమే వాడాలని, ఇతర వాటి కోసం టైమ్ పాస్ చేసుకోవద్దన్నారు. సెల్ ఫోన్ వాడకంతో విద్యార్థులు తప్పు తోవ పట్టే అవకాశం ఉందని, ప్రతి విద్యార్థిపై తల్లిదండ్రులు సైతం దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తెలిసి తెలియక చేసే తప్పులకు జైలు పాలు అయి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలంతో పోటీ పడి విజయపథంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషు, అధ్యాపకులు ఉన్నారు.