- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బస్సుల్లో పిల్లలు భద్రమేనా ?
దిశ, జన్నారం : ప్రైవేటు పాఠశాల బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించడంలో విద్యార్థులు భ్రదమేనా అని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలోని ఉన్న బస్సులలో పరిమితికి మించి ఒక్కో బస్సులో 51 మంది సీట్ల కేపాసిటి కానీ ఆ బస్సుల్లో విద్యార్థులను 70 నుండి 80 మంది విద్యార్థులను తరలిస్తున్నారని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. పిల్లలకు సరిపడ బస్సులు లేకపోవడంతో ఒక్కో బస్సు రెండు ట్రిప్పులు వేయ్యాల్సి వస్తుంది.
రెండవ ట్రిప్పు స్కూల్ టైంకి రావాలి కనుక మొదటి రెండవ ట్రిప్పును అధిక స్పీడుతో వెళ్ళి విద్యార్థులను తీసుకురావడం వలన ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు మండల ప్రజలు కంగారు పడుతున్నారు. బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బస్సుల్లో సీట్లు, అద్దాలు, టైర్లు అన్ని సక్రమంగా లేకున్న బస్సులను నడుపుతున్నారు. ఇప్పటికైనా రవాణ శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఆ బస్సులను నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై తగుచర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.