కుక్కల దాడిలో చుక్కల దుప్పికి గాయాలు

by Shiva |
కుక్కల దాడిలో చుక్కల దుప్పికి గాయాలు
X

దిశ, పెంబి: కుక్కల దాడిలో చుక్కల దుప్పికి గాయాలైన ఘటన పెంబి మండల కేంద్రంలో కొత్తగూడెం అటవీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. ఓ చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుూ గాయపరచగా గమనించిన కొత్తగూడెం వాసులు కుక్కలను తరిమి చుక్కల దుప్పిని రక్షించి సెక్షన్ అధికారి శ్రీనివాస్ కు అప్పగించారు. దుప్పికి స్వల్ప గాయాలు కావడంతో వైద్యం అందించి అడవిలో వదిలిపెట్టినట్లు సెక్షన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వారి వెంట దేశ రాజు నారాయణ, బీట్ అధికారి ఆశిష్, కొత్తగూడెం వాసులు ఉన్నారు.

Advertisement

Next Story