కొలాంగూడ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రామాన్ని నిర్మిస్తాం : సిర్పూర్ ఎమ్మెల్యే

by Aamani |
కొలాంగూడ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రామాన్ని నిర్మిస్తాం : సిర్పూర్ ఎమ్మెల్యే
X

దిశ,బెజ్జూర్ : సిర్పూర్ మండలం, వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొలాంగూడలో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల ఆవాసాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిమ తెగకు చెందిన కొలాంగూడ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రామాన్ని నిర్మిస్తామని, ఇదివరకే ఈ గ్రామానికి నెల రోజుల క్రితం విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం, గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ ఇండ్లు మంజూరు చేయించి వారి జీవనోపాధికి సహకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, బీజేపీ నాయకులు గొల్లెన మనోహర్, మడావి భీంరావు, జాడి దీపక్, కుమార స్వామి, పంబాల రాజు, అంగళ్ళ సన్నీ, సాయి తదితరులు. పాల్గొన్నారు.



Next Story