అత్యుత్సాహంతో సింగరేణి కార్మికుని హల్ చల్..

by Sumithra |
అత్యుత్సాహంతో సింగరేణి కార్మికుని హల్ చల్..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన కొప్పుల రవి శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. సింగరేణి లాభాల్లో 30శాతం బోనస్ సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ చొరవతోనే కార్మికులకు న్యాయం జరిగిందని అతి ఉత్సాహంతో గన్ బుల్లెట్లతో జై బాల్క సుమన్ అని స్టేటస్ పెట్టుకుని హల్చల్ చేశాడు.

ఈ విషయం నెట్టింట హల్చల్ కావడంతో సాధారణ సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న ఇతని వద్ద బుల్లెట్లు ఎక్కడినుండి ప్రత్యక్షమైనవని జిల్లా ప్రజలకు అంతుచిక్కని ప్రశ్న. సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఈ విషయం పోలీస్ అధికారుల వరకు చేరింది. పోలీస్ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సింగరేణి ఏరియాలో సీకాస ప్రాబల్యం తగ్గిన తర్వాత బుల్లెట్ కల్చర్ తగ్గిందా అని చెప్పుకోవచ్చు. కానీ తిరిగి ఈ విషయంతో ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు.

Advertisement

Next Story