- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు...
దిశ, నస్పూర్ : ట్రాలీ ఆటో ని వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ఘటనలో సింగరేణి కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యారు. పూర్తి వివరాల ప్రకారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5బీ గనిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్న కలవేన రమేష్ గురువారం ఉదయం షిఫ్ట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆర్కే 5 సమీపంలోని లారీ యార్డు వద్ద ముందుగా వెళుతున్న ట్రాలీ ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ట్రాలీ ఆటోను ఆపడంతో రమేష్ తన బైక్ తో వెనకాల ఢీ కొట్టి పడిపోయాడు.
రమేష్ తల వెనుక భాగంలో తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే రెండుసార్లు ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎక్కువగా రక్తస్రావం జరుగుతుండగా తోటి కార్మికులు గుర్తించి అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.