టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

by Sridhar Babu |
టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
X

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేయాలని, జనవరి నుండి రివిజన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మొదటి సంగ్రహణాత్మక ఫలితాల ఆధారంగా విద్యార్ధుల ఏ, బీ, సీ వర్గీకరణ చేసి, సీ-గ్రేడ్ విద్యార్ధులకు ప్రత్యేక బోధన ద్వారా వారి ప్రతిభను మెరుగుపరిచి పదవ తరగతి పాస్ అయ్యేలా చూడాలని కోరారు. అనేక కారణాల వలన తరుచూ పిల్లలు గైర్హాజర్ అయి చదువుకు దూరం అవుతున్నారని, పిల్లలందరినీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అడప్షన్ చేసుకొని వారి ప్రతిభను, హజరును పెంపొందిస్తే వంద శాతం రిజల్ట్ ను తీసుకు రావచ్చని అన్నారు.

గత సంవత్సరం వార్షిక ఫలితాలలో తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల్లో ఎక్కువ దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఇంటర్మీడియట్ లో జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, హాజరు శాతాన్ని పెంచడానికి విద్యార్థులను అడాప్షన్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రణాళిక బద్ధంగా వారికి బోధన చేసి, పూర్తి బాధ్యత వహించి విద్యార్థులను మెరుగు పరచాలని సూచించారు. హాస్టల్ వెల్ఫేర్, ఎంజేపీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించి వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed